మధ్యప్రదేశ్ నాగ్జిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున దారుణం జరిగింది. బీజేపీ యువ నేత ప్రకాష్ యాదవ్‌కు ఎస్పీ భదోరియాకు మధ్య వివాదాలున్నాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి భదోరియా పిస్టల్‌తో వచ్చాడు. పోలీసుల ముందే ప్రకాష్‌పై కాల్పులు జరిపి పరారయ్యాడు. ప్రస్తుతం ప్రకాష్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.