ఇవాళ ఢిల్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల అవ్యాన్ తోమర్ అనే బాలుడు కేజ్రీవాల్ గెటప్‌లో సందడి చేశాడు. కేజ్రీవాల్‌కు మద్దతుగా తండ్రితో పాటు ఫిరోజ్ షా రోడ్డుకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా బాలుడి తండ్రి రాహుల్ తోమర్ మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల ఫలితాల రోజు తాము అక్కడికి వస్తుంటామని తెలిపారు. ఆప్ పార్టీ తమ బిడ్డకు ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అని పేరు పెట్టిందని వెల్లడించారు.