బిహార్ బక్సర్ జిల్లాలోని నందన్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ త్యాగి యాదవ్ దేశభక్తిని చాటుకున్నారు. మే 7న ప్రియతో కలిసి ఏడు అడుగులు వేస్తుండగా.. ఆపరేషన్ ’సిందూర్' ప్రారంభమైంది. వెంటనే విధుల్లో చేరాలని పిలుపువచ్చింది. 9న శ్రీనగర్‌లోని తన ఆర్మీ యూనిట్‌లో విధుల్లో చేరారు. వెళ్లే ముందు తనకు దేశం కంటే ఏదీ పెద్దది కాదని, దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. అతడి మాటలు విన్నవారు గర్వంతో ఉప్పొంగారు.