మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్మించిన 90 డిగ్రీల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ వంతెనపై విమర్శలు వచ్చాయి. అయితే, ఇప్పుడు పాములా మెలికలు తిరిగిన మరో వంతెన వెలుగులోకి వచ్చింది. ఈ వంతెన నిర్మాణంలో ఇంజినీర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వంతెనపై డివైడర్లు సైతం సరిగా లేవు. దీంతో దీని భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.