హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ప్రమాదం తప్పింది. చిన్న బ్రిడ్జి రోడ్డుపై విద్యుత్ హై టెన్షన్ వైరు తెగిపడింది. సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు హౌ టెన్షన్ వైరు తెగిపడింది. అయితే అటుగా వెళ్లే వాహనదారులు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాహనదారులు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో ఆ దారిలో ట్రాఫిక్ స్తంభించింది. చివరికి విద్యుత్ సిబ్బంది వచ్చి వైరుకు కరెంట్ సరఫరా నిలిపేసి పక్కకు తీసేశారు.