బ్యూటీ క్వీన్ దారుణ హత్య (వీడియో)

558చూసినవారు
ఈక్వెడార్ బ్యూటీ క్వీన్ లాండీ పర్రాగా గోయ్‌బురో (23) హత్యకు గురైంది. ఏప్రిల్ 28న క్యూవెడో నగరంలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా దుండగులు తుపాకీతో కాల్చి ఆమెను చంపారు. రెస్టారెంట్‌కు చేరుకోగానే గోయ్‌బురో తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె లొకేషన్‌ను తెలుసుకున్న దుండగులు రెస్టారెంట్‌కు చేరుకుని అందాల భామను అక్కడికక్కడే హత్య చేశారు. 2022 మిస్ ఈక్వెడార్ పోటీలో ఆమె పాల్గొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్