ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

80చూసినవారు
ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో దారుణం జరిగింది. పల్లడం సమీపంలోని సెమాలికౌండన్ పాళయంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కుమారుడిని శుక్రవారం తెల్లవారుజామున దుండగులు నరికి చంపారు. మృతులు దైవశికామణి, అతని భార్య ఆలమత్తల్‌, కుమారుడు సెంథిల్‌కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం ఇంట్లోని డబ్బు, నగలు చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హంతకుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్