తెలంగాణలోని భువనగిరి హౌసింగ్ బోర్డ్ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆనందంగా ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.