టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో న్యాయవాది తిరుపతి వర్మ ఆధ్వర్యంలో తెలంగాణ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు BNS యాక్ట్ సెక్షన్ 105, 118 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.