ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదు అయింది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై ఫిర్యాదు చేశారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.