సీఎం చంద్రబాబుతో సహా టీటీడీ ఈవో, ఛైర్మన్ పై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి రోజా విమర్శించారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ రోజా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఒకరు చనిపోతే 14 మందిపై కేసు నమోదు చేశారని ఇక్కడ ఆరుగురు చనిపోయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వెంటనే బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.