‘తెలంగాణ రైజింగ్- 2047’తో నినాదంతో ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. "ఫిల్మ్ ఇండస్ట్రీ రాణించాలని మా ప్రభుత్వం ఆలోచన. 2047 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 3ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చెందాలి. మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీకు కావాల్సిన సదుపాయాల కల్పిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. అది రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఉంది." అని సీఎం అన్నారు.