పాక్‌లో పట్టుబడ్డ అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్ సన్నిహితుడు

85చూసినవారు
పాక్‌లో పట్టుబడ్డ అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్ సన్నిహితుడు
ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్ అత్యంత సన్నిహితుడిగా పరిణగించబడుతన్న అమీన్ ఉల్ హక్‌‌ని పాకిస్తాన్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. యూఎన్ ఆంక్షల జాబితాలో ఉన్న ఉగ్రవాది అయిన హక్‌ని పంజాబ్ ప్రావిన్స్ ఉగ్రవాద నిరోధక అధికారులు పట్టుకున్నారు. అమెరికా ట్విన్ టవర్స్‌పై 9/11 దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి బిన్‌లాడెన్‌కి ఇతను సన్నిహితుడు. పంజాబ్ ప్రావిన్సుల్లో విధ్వంసానికి హక్ ప్లాన్ చేస్తున్నట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్