మల విసర్జనకు వెళ్లిన దళిత బాలికను నిప్పు పెట్టి చంపేశారు

595చూసినవారు
మల విసర్జనకు వెళ్లిన దళిత బాలికను నిప్పు పెట్టి చంపేశారు
ఉత్తరప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. మల విసర్జన కోసం బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పుపెట్టారు. దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. హరయా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 13 ఏళ్ల దళిత బాలిక శుక్రవారం సాయంత్రం మల విసర్జన కోసం సమీపంలోని పొలాల వద్దకు వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతకగా పొలాల్లో కాలిపోయిన బాలిక మృతదేహం కనిపించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you