ప్రాణం తీసిన డ్రైవింగ్ సరదా.. ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి

63చూసినవారు
ప్రాణం తీసిన డ్రైవింగ్ సరదా.. ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి
TG: డ్రైవింగ్ సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల విష్ణు, రాజులు కలిసి ట్రాక్టర్ తో వారి పొలం చదును చేయడానికి వెళ్లారు. అక్కడే ఉన్న వీరి బాబాయ్ కొడుకు వినయ్(15) ట్రాక్టర్ నేర్చుకోవడానికి వెళ్లాడు. ముగ్గురు ట్రాక్టర్ ఇంజన్ పై కూర్చున్నారు. ట్రాక్టర్ కంట్రోల్ కాక ఇంజన్ వినయ్ పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విష్ణు రాజులకు తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్