బైక్ పార్కింగ్‌ విషయంలో గొడవ.. యువ సైంటిస్ట్ మృతి (వీడియో)

65చూసినవారు
బైక్ పార్కింగ్‎ విషయంలో జరిగిన గొడవ ఓ యువ సైంటిస్ట్ ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌‎కు చెందిన డాక్టర్ అభిషేక్ (39) పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని IISER‌ లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‎గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బైక్ పార్కింగ్ విషయంలో పక్కింటి వ్యక్తి మాంటీతో గొడవ జరిగింది. దీంతో మాంటీ అభిషేక్‎ను దారుణంగా కొట్టడంతో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్