తొక్కుకుంటూ పోయిన టెంపో.. ఐదేళ్ల బాలుడు మృతి (వీడియో)

79చూసినవారు
ఢిల్లీ అశోక్ విహార్‌లోని వజీర్‌పూర్ పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం విషాద ఘటన జరిగింది. ఓ టెంపో రోడ్డుపై దూసుకొచ్చింది. ఇంతలో బాలుడు అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బాలుడిని టెంపో ఢీకొట్టింది. అనంతరం కింద పడిన బాలుడిని తొక్కుకుంటూ టెంపో ముందుకు వెళ్లిపోయింది. టెంపో చక్రాల కింద నలిగి బాలుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్