డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

52చూసినవారు
డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్‌ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట పరిధిలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆదిభట్ల పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి 3.8 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :