TG: ఆస్ట్రేలియాకు చెందిన కోస్టా యాప్ రూ.15 కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. ఆ యాప్ బాధితులు శనివారం జనగామ పోలీసులను ఆశ్రయించారు. ఈ యాప్‌లో తొలుత పెట్టుబడులు పెట్టిన కొందరికి రెట్టింపు రావడంతో వారు గొలుసు పద్ధతిలో మరికొందరిని చేర్పించారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టించారు. కొద్దిరోజులుగా యాప్‌లో డబ్బుల విత్‌డ్రా ఆప్షన్ తొలగించడంతో అందరూ లబోదిబోమంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది బాధితులున్నారు.