వేటాడే ప్రవృత్తి నరనరానా జీర్ణించుకుపోయిన సింహాలు, పులులతో ఎప్పటికైనా ప్రమాదమే. ఇవన్నీ తెలిసినా కొందరు రిస్క్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి రిస్క్ చేసి దాదాపు మరణం అంచుల వరకూ వెళ్లిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సింహం ఉన్న బోనులోకి ఇద్దరు యువకులు వెళ్లారు. ఇంతలో ఓ యువకుడు దాని పక్కన కూర్చుని వీపుపై నిమిరే ప్రయత్నం చేశాడు. దీంతో, సింహం అతడిపై ఎగబడింది. చివరికి ఎలాగోల తప్పించుకున్నాడు.