కాలువలో కొట్టుకుపోతున్న వ్యక్తిని టవల్ వేసి కాపాడాడు (వీడియో)

51చూసినవారు
కాలువలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని ఓ యువకుడు చిన్న ట్రిక్‌తో రెప్పపాటులో కాపాడాడు. ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరద నీటిలో స్నేహితుడు కొట్టుకుపోవడాన్ని చూసిన వ్యక్తి చేతిలో టవల్ తీసుకుని పరుగెత్తుకుంటూ వెళ్లి కాలువపై ఉన్న బ్రిడ్జిపైకి వెళ్లాడు. కాలువపై ఏర్పాటు చేసిన స్తంభాలపై పడుకుని స్నేహితుడు సరిగ్గా దగ్గరికి రాగానే టవల్‌ను విసిరాడు. టవల్‌ను పట్టుకోగానే పైనుంచి అతన్ని గట్టిగా పైకి లాగేశాడు.

సంబంధిత పోస్ట్