ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా.. తన జీ సిరీస్‌లో జీ85 పేరిట మరో 5జీ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 50 ఎంపీ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మోటో జీ85 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM+128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించింది. 12GB RAM+256GB వేరియంట్ ధర రూ.19,999గా పేర్కొంది. జులై 16 మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.