TG: తొలిసారి ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తవ్వకాలు చేపట్టడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ పరిణామం సింగరేణి సంస్థ చరిత్రలో కొత్త అధ్యాయమని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 16) నుంచి ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో SCCL ఉత్పత్తి ప్రారంభించింది. భారతదేశ ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి ఇది గర్వకారణం అని కేంద్రమంత్రి అన్నారు.