వణికిస్తున్న కొత్త వ్యాధి.. లక్షణాలివే

61చూసినవారు
వణికిస్తున్న కొత్త వ్యాధి.. లక్షణాలివే
మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ కలకలం రేపుతోంది. దీని ప్రభావం నరాలపై పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి కండరాలు బలహీనంగా మారతాయి. ఒళ్లంతా తిమ్మిరి ఎక్కుతుంది. అయితే ఈ వ్యాధికి ప్రధాన కారణం కలుషిత నీరు, ఆహారమేనని చెబుతున్నారు. ఈ వ్యాధిన పడిన వారిలో డయేరియా, పొత్తుకడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, కాచి, చల్లార్చిన నీటిని తాగాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్