TG: 20 మంది విద్యార్థులున్నచోట ప్రభుత్వ పాఠశాల లేకుంటే వెంటనే స్కూల్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. తాజాగా పాఠశాల విద్య డైరెక్టర్ అన్ని జిల్లాల డీఈవోలు, మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాలల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులుండి పాఠశాలు లేనిచోట వెంటనే ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 359, గ్రామీణ ప్రాంతాల్లో 212 పాఠశాలలు అవసరమని అధికారులు నివేదిక రూపొందించారు.