TG: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక రాత్రి పడుకున్న స్థలంలోనే మృతి చెందింది. బాలిక నోటినుంచి నురగ రావడంతో మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతి కారణాలు తెలియాల్సి ఉంది.