తమ ఇల్లును కూల్చివేస్తారేమోనని ఆవేదన చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అంబర్‌పేట్ నియోజకవర్గం తులసీరాం నగర్లో మూసీ కూల్చివేతల భయంతో రెండు రోజులుగా భయపడుతున్న గంధ శ్రీకుమార్ (55) అనే వ్యక్తి గుండెపోటుతో బుధవారం ఉదయం మరణించినట్లు సమాచారం. కాగా, కుమార్‌కు ఇప్పటికే భార్య చనిపోగా ముగ్గురు పిల్లలు ఉన్నారు.