ఇవాళ ఒమన్-నమీబియా మధ్య జరిగిన టీ20ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఒమన్ టీమ్‌లోని ఆరుగురు బ్యాటర్లు ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగారు. మెన్స్ టీ20లో ఇంతమంది ఇలా ఔటవడం ఇదే తొలిసారి. గతంలో నెదర్లాండ్స్(వర్సెస్ శ్రీలంక), స్కాట్లాండ్(vsఅఫ్గాన్) బ్యాటర్లు ఐదుగురు ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యారు. ఇవాళ మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్‌లో నమీబియా గెలిచిన విషయం తెలిసిందే.