తెలంగాణలో సర్వనాశనం చేసే విధ్వంసకర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. పదవుల్లోకి రాగానే ప్రజలను మోసం చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసకర ఆలోచనలతో నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరు మా పార్టీలో లేరు. మీడియా మేనేజ్‌మెంట్‌తో ప్రధాని మోదీ దృష్టిలో పడేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.