ఇస్లాం మతంలో మొహర్రం చాలా పవిత్రమైనది. ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొత్తం 12 నెలలు ఉంటాయి. వీటిలో జుల్-ఖదా, జుల్-హిజ్జా, మొహర్రం, రజబ్. ఈ నాలుగు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నెలల్లో దానధర్మాలు చేయడం శుభప్రదం. అల్లా ఆశీస్సులు పొందేందుకు ముస్లింలు ఈ నెలలో ప్రత్యేక ప్రార్థనలు, దానం చేస్తారు.