TG: తల్లి మందలించిందని రైలు కిందపడి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మంలోని సారధి నగర్ సమీపంలోని మామిళ్లగూడెంలో సోమవారం చోటు చేసుకుంది. లక్ష్మీ నక్షత్ర ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లి మందలించిందనే కారణంతో క్షణికావేశంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.