ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమా చూడటానికి లీవ్ కావాలని ఓ విద్యార్థి టీచర్‌కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'సార్ నేను అల్లు అర్జున్ అభిమానిని.. పుష్ప-2 సినిమాకు వెళుతున్నాను. దయచేసి నాకు ఈ రోజు లీవ్ ఇవ్వండి' అంటూ నిజాయితీగా తన లీవ్ లెటర్‌లో విద్యార్థి పేర్కొన్నాడు. ఈ లెటర్ చదవిన టీచర్ ఆశ్చర్యానికి గురై, ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు.