గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ జరగడానికి గల కారణాలు తేల్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

58చూసినవారు
గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ జరగడానికి గల కారణాలు తేల్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్‌ పాయిజన్‌ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ ఫుడ్‌ పాయిజన్‌ జరిగినప్పుడు కారణాలు తేల్చి.. బాధ్యులను గుర్తించనుంది. ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌, అదనపు డైరెక్టర్‌, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్‌సేఫ్టీ కమిటీలను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్