క‌న్నీరు పెట్టిస్తున్న ఘ‌ట‌న‌.. VIDEO

77చూసినవారు
AP: ఓ భ‌ర్త త‌న భార్య డెలివ‌రీ కోసం వ‌చ్చి అనంత‌లోకాల‌కు చేరుకున్నాడు. తిరుప‌త్లి జిల్లాలోని తొట్టంబేడు మండ‌ల ప‌రిధిలోని బ‌స‌వ‌న్న గుంట‌కు చెందిన హ‌రికృష్ణ త‌న భార్య చెంగ‌మ్మ డెలివ‌రీకి బెంగ‌ళూరు నుంచి వ‌చ్చాడు. డెలివ‌రీకి అవ‌స‌ర‌మైన డ‌బ్బు తెచ్చేందుకు బైక్‌పై శ్రీకాళ‌హ‌స్తి వెళ్తుండ‌గా టెంపో వ‌చ్చి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బ‌స‌వ‌న్న మృతిచెందాడు. మృతున్ని శ్రీకాళ‌హ‌స్తి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అదే ఆస్ప‌త్రిలో డెలివ‌రీకి సిద్ధంగా ఉన్న భార్య.. మూట‌క‌ట్టిన భ‌ర్త శ‌వాన్ని చూసి బోరున విల‌పించింది.

సంబంధిత పోస్ట్