కూరగాయలు, పండ్లు కట్ చేసుకునేందుకు వివిధ రకాల చాపింగ్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. మనం కూరగాయలు తరిగినప్పుడు అందులోని సారాన్ని ఇవి సులభంగా గ్రహిస్తాయి. వీటిలో బ్యాక్టీరియా, శీలింధ్రాలు పెరగడం వల్ల జీర్ణవ్యవస్థ ప్రమాదకర వ్యాధుల బారిన పడుతుంది. పాత కటింగ్ బోర్డుల నుంచి వచ్చే ప్లాస్టిక్, చెక్క వ్యర్థాల వంటివి ప్రేగులలోకి వెళ్లి తిష్ట వేస్తాయి. దీనికి బదులుగా గాజు, స్టీల్ బోర్డులు వంటివి వాడొచ్చు.