ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో దారుణం జరిగింది. ట్రాక్టర్లతో స్టంట్స్ చేస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో తేజ్‌వీర్ అనే ట్రాక్టర్ డ్రైవర్ కింద పడి నలిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వివరాల ప్రకారం… గ్రామంలో ట్రాక్టర్లతో స్టంట్స్ నిర్వహించగా, తాడుతో కట్టిన రెండు ట్రాక్టర్లను వెనక్కి లాగేందుకు ప్రయత్నించగా.. తేజ్‌వీర్ ట్రాక్టర్ అదుపు తప్పి పైన పడటంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.