ఇండియన్ రైల్వే టికెట్ కలెక్టర్ స్వప్నిల్ కుసాలే పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. రెజ్లింగ్‌కు కంచుకోట అయిన కొల్హాపూర్(MH)కు చెందిన ఆయన షూటింగ్‌లో అదరగొట్టారు. రైల్వే TCగా పనిచేసిన ధోనీ అంటే తనకెంతో అభిమానమని కుసాలే నిన్న మీడియాతో పంచుకున్నారు. ఆయనలా మైదానంలో ప్రశాంతంగా ఉండటం తన ఆటకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.