ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై పాల ట్యాంకర్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.