ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి

60చూసినవారు
ఢిల్లీలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శాస్త్రి పార్క్ సమీపంలో ఉదయం ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిపైకి ఓ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటన అనంతరం డ్రైవర్‌ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్