భార్యకు, ఆమె సొంత సోదరుడితోనే అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ గుజరాత్లోని అహ్మదాబాద్లో 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సూసైడ్ నోట్ను గుర్తించిన బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య & బావమరిదిని ఇంట్లో చూడకూడని స్థితిలో తన కొడుకు చూశాడని ఆ లేఖలో ఉందన్నారు. సోదరుడితో సంబంధం కారణంగానే ఆమెకు గతంలో 4 సార్లు విడాకులు అయ్యాయని, ఇది సదరు మహిళకు ఐదో పెళ్లి అని సమాచారం.