కారు ఢీ.. ఎగిరిపడ్డ మహిళ (వీడియో)

58చూసినవారు
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. గంగాపూర్ రోడ్ ప్రాంతంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఆ మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు ఆ మహిళ గాల్లోకి ఎగిరి కింద పడింది. అక్కడే ఉన్న కొందరు వెంటనే స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్