ఆరుడుగులు పూర్తిచేసి ఏడోవ అడుగు వేయబోతుండగా.. మాజీ ప్రియురాలు ఫోన్ చేయగానే ఏడో అడుగు ఆపేసి ఓ యువకుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పెళ్లి క్యాన్సిల్ అవడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. బంధువులు, స్నేహితులు అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వరుడు ఎంతకు ఒప్పుకోకపోవడంతో వధువు పేరెంట్స్ గొడవకు దిగారు. బంధువులను అతన్ని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.