మహిళను వేధించిన యువకుడు…వైరలవుతున్న వీడియో

56చూసినవారు
యూపీలోని ముజఫర్‌నగర్ నైమండి ప్రాంతంలో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోహిత్ అనే వ్యక్తి ఓ మహిళను రోడ్డుపై వేధిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో కాస్తా వైరల్ కావడంతో పోలీసుల కంట్లో పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెటిజన్లు, స్థానికులు సైతం అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్