ప్రియురాలితో జల్సా కోసం సొంతింట్లో 16 తులాల బంగారం ఎత్తుకెళ్లిన యువకుడు

79చూసినవారు
ప్రియురాలితో జల్సా కోసం సొంతింట్లో 16 తులాల బంగారం ఎత్తుకెళ్లిన యువకుడు
TG: వరంగల్‌లోని మిల్స్ కాలనీలో జయంత్ అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి ప్రియురాలితో జల్సా చేసేందుకు డబ్బు కోసం తన ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. వరంగల్‌కు చెందిన రామకృష్ణ జూన్ 8న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. అదే అదనుగా హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న రామకృష్ణ కొడుకు జయంత్, ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 16 తులాల బంగారం ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు హాస్టల్‌కు వెళ్లిపోయాడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్