ప్రేమ పేరుతో ఆకతాయిల వేధింపులు.. యువతి ఆత్మహత్య

71చూసినవారు
ప్రేమ పేరుతో ఆకతాయిల వేధింపులు.. యువతి ఆత్మహత్య
నల్లగొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ యువతి సూసైడ్ చేసుకుంది. యవతిని ప్రేమించాలని ఇద్దరు యువకులు వేధించారు. తాము చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియాలో ఫొటోలు పెడతామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఈనెల 6న పురుగుల మందు తాగగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. చనిపోయే మందు యువతి జడ్జికి మరణ వాంగ్మూలం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్