TG: నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులు భరించలేక కల్యాణి (18) అనే యువతి ఈ నెల 6న పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. కల్యాణి తల్లి ఫిర్యాదుతో శివ, మధుపై మాడుగులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.