సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఆశతో ఓ యువతి ప్రాణాలతో చెలగాటమాడింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ గంగా నదిలో రీల్ చేస్తుండగా నీటి ప్రవాహంలోకి జారిపోయి మృతి చెందింది. ఈత రాకపోవడం, ప్రవాహాన్ని అంచనా వేయకపోవడమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ ‘ఓ రీల్ కోసం ప్రాణాలు ఎందుకు వృధా చేస్తారు?’ అంటూ మండిపడ్డారు. రీల్స్ కోసం ప్రాణాలతో ఆటలాడొద్దని పోలీసులు అంటున్నారు.