యూపీలోని హత్రాస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కుమార్తె కల్పిత శర్మను కొందరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కల్పిత శర్మ తన తల్లితో స్కూటీపై మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు బైకుపై వచ్చి యువతిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కల్పిత శర్మ మృతిచెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాదాల కారణంగా హత్య జరిగినట్లు తెలుస్తోంది.