బీరు తాగించి యువతిపై సామూహిక అత్యాచారం!

84చూసినవారు
బీరు తాగించి యువతిపై సామూహిక అత్యాచారం!
వరంగల్ లో దారుణ ఘటన చోటుచేసుంది. ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులు గత నెల 15న తనను కారులో ఎక్కించుకుని ఓయో రూమ్ కు తీసుకెళ్లి, బీరు తాగించి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు తాను చదివే కాలేజీలోనే బీటెక్ చదువుతున్నారని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్