TG: మనిషికి ఆధార్ కార్డులాగే భూమికి భూధార్ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ప్రతి కమతానికో నంబరు ఇద్దాం. ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు.. వ్యవసాయ భూముల్ని పక్కాగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది? రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకుందాం. కొందరు రెవెన్యూశాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునే బాధ్యత మనందరిది’ అని అన్నారు.